Home న్యూస్ అక్కడ 1.8 కోట్లు….టాలీవుడ్ లో రికార్డ్ ఇది!

అక్కడ 1.8 కోట్లు….టాలీవుడ్ లో రికార్డ్ ఇది!

1276
0

బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ గ్రాండ్ రిలీజ్ కి టైం దగ్గర పడింది, సినిమా కి అన్ని సెంటర్స్ ల యమ జోరుగా రిలీజ్ ప్లానింగ్స్ జరుగుతూ ఉండగా థియేటర్స్ కూడా భారీగా అరేంజ్ చేస్తున్నారు. ఇక బిజినెస్ కూడా అల్టిమేట్ అనిపించే విధంగా సాగుతూ ఉండగా సినిమా కి హైర్స్ కూడా ఇప్పుడు యాడ్ అవ్వబోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా సెంటర్స్ లో…..

పెద్దగా ట్రాకింగ్ ఉందని సి డి సెంటర్స్, చిన్న చిన్న స్టేషన్స్ ని గంపగుత్తుగా ఒక రేటుకి అనుకుని రేటు చెల్లిస్తారు బయర్స్… ఇక అక్కడ టికెట్ రేట్లు వాళ్ళ ఇష్టం, నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళకే… ఆ రేటుని సినిమాల…

కలెక్షన్స్ విషయంలో ఫస్ట్ డే కి, వీకెండ్ కి లేదా వీక్ ఎండ్ అయ్యే టైం కి కలుపుతారు. వీటినే హైర్స్ అంటారు, ఇప్పుడు అఖండ సినిమాకి కూడా పలు చోట్ల హైర్స్ కన్ఫాం అవ్వగా గుంటూరు సి డి సెంటర్స్ లో 1.8 కోట్ల హైర్స్ ని బయ్యర్లు కోట్ చేశారట మేకర్స్ కి….

సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో ఇది హైయెస్ట్ రేటుగా చెప్పాలి. కానీ మేకర్స్ ఇంకా బెటర్ ఆఫర్ వస్తుందా అని ఎదురు చూస్తారట, రిలీజ్ టైం కి ఇంతకుమించి ఆఫర్ రాకుంటే ఈ రేటు ఫైనల్ అవ్వడం ఖాయం అని చెప్పాలి ఇక…. బాలయ్య బోయపాటి ల కాంబో క్రేజ్ ఈ రేంజ్ లో బిజినెస్ చేస్తుండగా కలెక్షన్స్ కూడా ఇదే రేంజ్ లో వస్తాయని…

అంతా నమ్మకంగా ఉన్నారు, టాలీవుడ్ తరుపున సెకెండ్ వేవ్ తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ బిగ్ మూవీ అవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమా పై ఉంది, మరి సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, ఎంతవరకు అంచనాలను అందుకుని ఈ కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here