స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ల తర్వాత తెరకక్కిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి భీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సంక్రాంతి రేసు లో భారీ పోటి ఉన్నా కానీ ఏకంగా 160 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు నుండే మ్యూజికల్ గా కూడా ఎలాంటి అద్బుతాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. రిలీజ్ అయిన ప్రతీ పాట లిరికల్ వీడియో అల్టిమేట్ రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాకుండా పాత రికార్డులు బ్రేక్ చేసింది. మొత్తం మీద ఈ సినిమా…
ఆల్బం ఇప్పుడు ఓవరాల్ గా 1 బిలియన్ కి పైగా స్త్రీమ్స్ ని సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ కొట్టింది, టాలీవుడ్ లో ఇలాంటి రికార్డ్ మరే సినిమా అందుకోలేదు… సినిమా లోను మూడు పాటలు, రాములో రాములా, బుట్టబొమ్మ మరియు సామజవరగమనా సాంగ్స్ లిరికల్ వీడియో లు అండ్…
వీడియో సాంగ్స్ కలిపి ఒక్క యూట్యూబ్ లోనే 1 బిలియన్ వ్యూస్ అంటే 100 కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసే రికార్డ్ ను అందుకుంది, ఇక మిగిలిన సాంగ్స్ అన్నీ కలిపితే లెక్క మరింత ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ సినిమా అల్లు అర్జున్ కి వన్స్ ఇన్ లైఫ్ టైం మూవీ గా మారింది…
అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రికార్డులు, ఇటు సాంగ్స్ పరంగా రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన అల వైకుంఠ పురం లో సినిమా ఇక 2020 ఇయర్ కి గాను అనౌన్స్ చేసే అవార్డుల విషయం లో కూడా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.