Home Uncategorized 1 హిట్…3 డిసాస్టర్లు…ఆశలన్నీ ఈ హీరో పైనే!!

1 హిట్…3 డిసాస్టర్లు…ఆశలన్నీ ఈ హీరో పైనే!!

1371
0

    హిట్లు ఫ్లాఫ్స్ ఎప్పుడు వస్తాయో ఎవ్వరూ అంచనా వేయలేరు…. కొందరు వరుస పెట్టి హిట్లు కొడతారు… కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫ్లాఫ్స్ ఎదురు అవుతాయి… కొందరికి ముందు లక్ అండ్ హార్డ్ వర్క్ కలిసి వస్తే తర్వాత అది బెడసి కొట్టే చాన్స్ కూడా ఉంది. ఈ కోవ లోకే వస్తుంది మైత్రి మూవీ మేకర్స్ పరిస్థితి… టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే ఒకటి తర్వాత ఒకటి వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ ని సొంతం చేసుకున్నారు.

మహేష్ తో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ మరియు రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలతో హాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారారు. కానీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకటి తర్వాత ఒకటి సినిమాలు అంచనాలను తప్పాయి.

ముందుగా సవ్యసాచి డిసాస్టర్ రిజల్ట్ ని ఇవ్వగా తర్వాత రవితేజ అమర్ అక్బర్ అంథోని భారీ డిసాస్టర్ అయ్యింది. తర్వాత చిత్రలహరి హిట్ కొట్టినా భారీ లాభాలు అయితే రాలేదు. ఇక తర్వాత భారీ హోప్స్ పెట్టుకున్న డియర్ కామ్రేడ్ కూడా డబుల్ డిసాస్టర్ అనిపించుకుంది. దాంతో ఫస్ట్ మూడు సినిమాలను వదిలేస్తే…

ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ కి 3 డిసాస్టర్లు ఒక హిట్ అన్న పరిస్థితి లో ఉండగా ఇప్పుడు ఆశలన్నీ నాని తో చేస్తున్న గ్యాంగ్ లీడర్ పైనే పెట్టుకున్నారు వీరు. రిలీజ్ కి ముందు మంచి పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తో తిరిగి మంచి…

కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు వీరు. దాంతో రీసెంట్ గా వరుస ఫ్లాఫ్స్ కి జెర్సీ తో బ్రేక్ వేసిన నాని ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కి గ్యాంగ్ లీడర్ తో తిరిగి అద్బుతమైన కంబ్యాక్ ఇచ్చే భాద్యతన ని తన భుజాన వేసుకున్నాడు. ఇక సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరించ గలుగుతుందో ఈ శుక్రవారం తేలనుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here