టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు 10 వ రోజు భారీ గ్రోత్ ని చూపెట్టింది. సినిమా వీక్ ఎండ్ టైం నుండి కూడా కలెక్షన్స్ పరంగా భారీగా స్లో డౌన్ అవ్వగా సెకెండ్ వీకెండ్ స్టార్ట్ అయినా కానీ శనివారం వరకు కూడా కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో అయితే సొంతం అవ్వలేదు…
ఇలాంటి టైం లో మరి కొన్ని రోజుల్లో రాధే శ్యామ్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న టైం లో భీమ్లా నాయక్ కి చివరి పెద్ద రోజు గా 10 వ రోజు ఆదివారం నిలవగా సినిమా ఆదివారం రోజున భారీగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా….
రెండు తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర 1.6 కోట్ల రేంజ్ నుండి 1.8 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని భావించగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 10 వ రోజున మొత్తం మీద 1.90 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో గ్రోత్ ని చూపించి సత్తా చాటింది….
దాంతో సినిమా మొత్తం మీద ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే….
👉Nizam: 34.42Cr(Without GST- 31.39Cr)
👉Ceeded: 10.84Cr
👉UA: 7.38Cr
👉East: 5.34Cr
👉West: 4.88Cr
👉Guntur: 5.10Cr
👉Krishna: 3.67Cr
👉Nellore: 2.48Cr
AP-TG Total:- 74.11CR(113Cr~ Gross)
👉KA+ROI: 8.15Cr
👉OS: 12.40Cr(updated)
Total World Wide: 94.66CR(154CR~ Gross)
ఇదీ మొత్తం మీద 10 రోజుల్లో సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… సినిమా మొత్తం మీద 108 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ తర్వాత సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవాలి అంటే ఇంకా 13.34 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది… ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.