Home న్యూస్ మాస్ట్రో వీర విహారం..10 డేస్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అంటే!

మాస్ట్రో వీర విహారం..10 డేస్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అంటే!

2102
0

యూత్ స్టార్ నితిన్ నభా నటేష్ మరియు తమన్నా ల కాంబినేషన్ లో బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన అంధధూన్ సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మాస్ట్రో ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సింది కానీ పరిస్థితులు అనుకూలించక పోవడం తో డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుని రీసెంట్ గా సినిమా రిలీజ్ ను సొంతం చేసుకుంది.

కాగా సినిమా ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్ళకి పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా ఒరిజినల్ ని చూడని వాళ్ళకి మాత్రం సినిమా చాలా బాగా నచ్చేసింది అని చెప్పాలి. దాంతో సినిమా కి వ్యూవర్ షిప్ అదిరిపోయే రేంజ్ లో సొంతం అయ్యిందని మేకర్స్ మొదటి రోజు తర్వాత అనౌన్స్ చేశారు.

ఫస్ట్ డే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని అనౌన్స్ చేయగా తర్వాత కూడా జోరు తగ్గకుండా సినిమా సాలిడ్ వ్యూవర్ షిప్ ను అలానే కొనసాగించింది అని అంటున్నారు ఇప్పుడు.

లేటెస్ట్ గా సినిమా 10 రోజులను పూర్తీ చేసుకోగా యూనిట్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం సాలిడ్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపిన మాస్ట్రో సినిమా ఆల్ మోస్ట్ 5 మిలియన్స్ వరకు వ్యూస్ ని సొంతం చేసుకుందని అంటున్నారు, కానీ ఇది ఓవరాల్ గా యూనిక్ వ్యూసా లేక ఓవరాల్ గా వచ్చిన వ్యూసా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు.

అయినా కానీ 5 మిలియన్ వ్యూస్ అంటే కూడా మాములు విషయం కాదనే చెప్పాలి.. రీమేక్ సినిమానే అయినా నితిన్ వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపింది మాస్ట్రో సినిమా.. ఇక మంత్ ఎండ్ తర్వాత అఫీషియల్ గా వ్యూవర్ షిప్ వివరాలు తెలియనున్నాయి. అప్పుడు పెర్ఫెక్ట్ లెక్కలను అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here