Home న్యూస్ హాట్రిక్ హిట్స్ కొట్టిన హీరో….12.5 కోట్ల టార్గెట్…10 రోజుల్లో వచ్చింది ఇది!

హాట్రిక్ హిట్స్ కొట్టిన హీరో….12.5 కోట్ల టార్గెట్…10 రోజుల్లో వచ్చింది ఇది!

2990
0

బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పెట్టి విజయాలతో కెరీర్ ని మొదలు పెట్టినా తర్వాత ఏకంగా డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ ని సొంతం చేసుకున్న మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తర్వాత చిత్రలహరి, ప్రతీ రోజూ పండగే మరియు సోలో బ్రతుకే సో బెటర్ లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సొంతం చేసుకుని హాట్రిక్ హీరోగా నిలిచాడు. ఈ మూడు సినిమాల విజయాలతో మళ్ళీ తిరిగి కెరీర్ మొదటి రోజుల…

క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న టైం లో దేవకట్ట డైరెక్షన్ లో చేసిన ఎక్స్ పెరి మెంటల్ మూవీ రిపబ్లిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాను ప్రమోట్ చేయడానికి హీరో ఇంకా కోలుకోకపోవడం తో డైరెక్టర్ అండ్ టీం తమ శక్తి మేరకు సినిమాను ప్రమోట్ చేసినా

ఇంత సీరియస్ మూవీ ని చూడటానికి జనాలు పెద్దగా ఆసక్తిని చూపలేదు, మొదటి వారం ఎలాగోలా అతి కష్టంమీద కలెక్షన్స్ ని సాధించిన సెకెండ్ వీకెండ్ లో థియేటర్స్ చాలా కోల్పోవడంతో కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపింది. 10 వ రోజు సినిమా 14 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది.

టోటల్ గా 10 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఇప్పుడు గమనిస్తే…
👉Nizam: 1.93Cr
👉Ceeded: 1.13Cr
👉UA: 76L
👉East: 43L
👉West: 41L
👉Guntur: 45L
👉Krishna: 44L
👉Nellore: 30L
AP-TG Total:- 5.85CR(9.70CR~ Gross)
Ka+ROI: 32L
OS – 48L
Total WW: 6.65CR(12.30CR~ Gross)
ఇదీ మొత్తం మీద రిపబ్లిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్.

సినిమాను మొత్తం మీద 12 కోట్లకు అమ్మగా సినిమా 12.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 10 రోజుల తర్వాత సాధించిన టోటల్ కలెక్షన్స్ తర్వాత సినిమా ఇంకా 5.85 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమే కాబట్టి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు డిసాస్టర్ గా నిలవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here