బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ యాక్టర్ కి హిట్స్ పడతాయి అలానే ఫ్లాఫ్స్ కూడా పడతాయి కానీ హిట్స్ పడినప్పుడు కన్సిస్టంట్ గా ఆడియన్స్ ను అలరించాల్సి ఉంటుంది, అలానే ఫ్లాఫ్స్ పడినా కానీ తన క్రేజ్ ని కోల్పోకుండా ఉంటే ఆ యాక్టర్ కి ఇండస్ట్రీ లో లాంగ్ రన్ కచ్చితంగా ఉంటుంది… లాంగ్ రన్ ఆల్ రెడీ సాలిడ్ గా ఉన్న నట సింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ టైం లో….
కెరీర్ లోనే ఆల్ టైం లోవేస్ట్ ఫేస్ లో ఉన్న టైం లో ఇప్పుడు అఖండ తో ఊహకందని కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా జై సింహా హిట్ తర్వాత చేసిన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ 2 పార్టులు అలాగే రూలర్ సినిమాలతో….
హాట్రిక్ డిసాస్టర్స్ ను సొంతం చేసుకున్న బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ తో ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ బిగ్గెస్ట్ లాస్ మూవీస్ ని సొంతం చేసుకోవాల్సి వచ్చింది. ఇక తర్వాత వచ్చిన రూలర్ సినిమా సైతం 24.50 కోట్ల టార్గెట్ కి కేవలం 10 కోట్లు మాత్రమే వసూల్ చేసి….
14.5 కోట్ల లోపు లాస్ తో డబుల్ డిసాస్టర్ గా నిలవగా కెరీర్ లోనే ఆల్ టైం లో లో ఉన్న టైం లో బోయపాటితో చేసిన హాట్రిక్ మూవీ అఖండ ఇప్పుడు ఓవరాల్ గా ఫైనల్ రన్ ని ఆల్ మోస్ట్ ఫినిష్ చేసుకోగా సినిమా ఏకంగా 75 కోట్ల క్లబ్ లో ఉండగా కెరీర్ లో నే వన్ ఆఫ్ బిగ్గెస్ట్ కంబ్యాక్ ని బాలయ్య ఇప్పుడు….
ఈ సినిమాతో సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. 10 కోట్ల షేర్ నుండి ఏకంగా 75 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పడితే తన రేంజ్ ఎలా ఉంటుందో చూపించాడు… ఆల్ మోస్ట్ 65 కోట్ల లీడ్ తో బిగ్గెస్ట్ మాస్ కంబ్యాక్ ని కెరీర్ లో సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపాడు బాలయ్య..