బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ ఇండస్ట్రీ మార్కెట్ మొదటి నుండి కూడా మిగిలిన సౌత్ భాషలతో పోల్చితే పెద్దదే అయినా కూడా తర్వాత టైంలో టాలీవుడ్ మార్కెట్ సాలిడ్ గా పెరిగిపోవడంతో కోలివుడ్ తరుపున అనుకున్న రేంజ్ లో భారీ కలెక్షన్స్ తో రాంపెజ్ ను సృష్టించిన సినిమాలు రావాల్సి ఉండగా ఉన్నంతలో….
ఒక్క ఏడాది గ్యాప్ లో ఇప్పుడు కోలివుడ్ తరుపున ఏ హీరో కూడా సాధించని విధంగా దళపతి విజయ్(Thalapathy Vijay) ఎపిక్ రికార్డ్ ను సృష్టిస్తూ అక్షరాలా 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు..లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన…
లియో మూవీ(Leo Movie)తో మిక్సుడ్ రెస్పాన్స్ తోనే టోటల్ రన్ లో ఏకంగా 600 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా…ఆ సినిమా వచ్చిన ఏడాది లోపే ఇప్పుడు ఆడియన్స్ ముందుకు విజయ్ నటించిన కొత్త సినిమా…
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, రీసెంట్ టైంలోనే విజయ్ కెరీర్ లో లీస్ట్ హైప్ తో వచ్చి ఆడియో పరంగా ఏమాత్రం జోరు చూపించలేక పోయింది. రిలీజ్ అయిన తర్వాత మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక తేరుకుంటుందో లేదో…
అన్న డౌట్స్ నెలకొనగా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ఏకంగా 400 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. దాంతో ఏడాది గ్యాప్ లో 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు…
కోలివుడ్ తరుపున ఒక్క ఏడాది గ్యాప్ లో 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించి విజయ్ ఎపిక్ రికార్డ్ ను నమోదు చేశాడు. ఇక మిక్సుడ్ టాక్ తో బ్రేక్ ఈవెన్ ని అందుకున్న గోట్ మూవీ ఇక మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటాడో చూడాలి.