అల వైకుంఠ పురంలో ముందు వరకు కూడా మంచి హిట్ మూవీస్ ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ భారీ రికార్డులు ఎప్పుడూ నమోదు చేయని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అల వైకుంఠ పురంలో సినిమాతో లాంగ్ రన్ లో ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేశాడు. తర్వాత చేసిన పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాల్లో…
అంచనాలను అందుకోలేక పోయినా కూడా వరల్డ్ వైడ్ గా మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా మీద అంచనాలు…
ఓ రేంజ్ లో ఉండగా ఇప్పుడు ఈ సినిమా ఊహకందని రేంజ్ లో 617 కోట్ల మమ్మోత్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. పుష్ప పార్ట్ 1 ఆల్ మోస్ట్ 145 కోట్ల బిజినెస్ అందుకుంటే పార్ట్ 2 కి గ్రోత్ ఏకంగా 472 కోట్ల రేంజ్ లో ఉంది ఇప్పుడు…అంటే ఏ రేంజ్ లో గ్రోత్ ను సొంతం చేసుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు.
ఇక అల్లు అర్జున్ నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఏకంగా 1000 కోట్ల మమ్మోత్ మార్క్ ని అందుకుని చరిత్ర సృష్టించాడు…అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది ఆల్ టైం ఎపిక్ రికార్డ్ అని చెప్పాలి. ఒకసారి అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీస్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#AlluArjun Recent Movies Business Details
👉#Pushpa2TheRule – 617CR💥💥💥💥
👉#Pushpa Part 1 – 144.9Cr
👉#AlaVaikunthaPurramuloo – 84.34Cr
👉#NaaperusuryaNaaIlluIndia – 76Cr
👉#DJ – 79CR
👉#Sarrainodu – 54Cr
👉#SonOfSathyamurthy – 54Cr
ఓవరాల్ గా సెన్సేషనల్ గ్రోత్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్…పుష్ప2 మూవీ తో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి టాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత లాస్ట్ 5 సినిమాలతో 1000 కోట్ల మార్క్ ని అందుకున్న రెండో హీరోగా రికార్డ్ ను నమోదు చేశాడు….ఇక పుష్ప2 మూవీతో అల్లు అర్జున్ ఏ రేంజ్ లో భీభత్సం సృష్టిస్తాడో చూడాలి.