10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 తో 100 కోట్లకు పైగా షేర్ ని అందుకుని దుమ్ము దులిపేశాడు. తర్వాత సైరా హ్యుమంగస్ బిజినెస్ ను అందుకోలేక పోయినా బాగానే వసూళ్లు రాబట్టింది. కానీ తర్వాత చేసిన ఆచార్య ఊహకందని ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా ఇంపాక్ట్ మెగాస్టార్ అప్ కమింగ్ మూవీస్ పై భారీగా ఎఫెక్ట్ చూపించింది…. ఎంతలా అంటే గాడ్ ఫాదర్ సినిమా…
మంచి టాక్ ని సొంతం చేసుకున్నా ఫ్యాన్స్ ని తప్ప కామన్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించ లేక ఫ్లాఫ్ అయింది. ఇలాంటి టైం లో భారీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టైంలో వాల్తేరు వీరయ్య భారీ పోటిలో రిలీజ్ అవ్వగా బడ్జెట్ ఎక్కువ అయినా బిజినెస్ ప్రీవియస్ 2 మూవీస్ ఎఫెక్ట్ వలన….
అనుకున్న విధంగా జరగలేదు. అయినా కానీ పోటిలో నిలిచిన సినిమా మొదటి రోజు తక్కువ కలెక్షన్స్ నే అందుకోవచ్చు అనుకుంటే… ఊచకోత స్టార్ట్ చేసి ఆల్ మోస్ట్ వీర సింహా రెడ్డి రేంజ్ కలెక్షన్స్ ని సాధించింది. ఇక రెండో రోజు నుండి ఊహకందని రేంజ్ లో లీడ్ ని చూపిస్తూ దూసుకు పోతున్న సినిమా…3 రోజుల్లోనే ఆల్ మోస్ట్ 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని….
మెగాస్టార్ కి మైటీ కంబ్యాక్ గా నిలిచింది. ప్రీ టికెట్ సేల్స్ లో వీర సింహా రెడ్డితో పోల్చితే వెనక బడి ఉన్నా రిలీజ్ తర్వాత సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు 1.5 మిలియన్ మార్క్ ని అందుకుంది. ఇక పండగ సెలవుల్లో టాలీవుడ్ టాప్ స్టార్స్ రికార్డ్ కలెక్షన్స్ సరసన నిలుస్తూ దూసుకుపోతున్న సినిమా మెగాస్టార్ కి మెగా కంబ్యాక్ గా నిలిచి మెగాస్టార్ స్టామినాని మరోసారి గుర్తు చేస్తూ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది.