బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhavanth Kesari) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ పాజిటివ్ టాక్ పవర్ ను చూపెడుతూ ఇప్పుడు దసరా సెలవుల్లో దుమ్ము లేపుతూ రచ్చ చేస్తుంది. సినిమా 6 రోజులు పూర్తి అయ్యే టైం కి…
తెలుగు రాష్ట్రాల్లో 68.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 91 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో పార్షిక హాలిడే అడ్వాంటేజ్ తో మరోసారి సాలిడ్ గా హోల్డ్ చేయగా అటూ ఇటూగా 7 కోట్ల నుండి ఇప్పుడు…
8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 9 కోట్ల నుండి ఆ పైన గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవాకాశం ఉందని చెప్పొచ్చు, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ లెక్క కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి.
(Bhagavanth Kesari 1st Week WW Gross Collections Update)
ఇక ఈ కలెక్షన్స్ తో సినిమా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 76.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 7 వ రోజు కలెక్షన్స్ తో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అయినా కూడా దసరా సెలవుల్లో మాత్రం ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వారానికి గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇక…