100 కోట్ల F2…ఊహకందని ఊచకోత ఇది

0
761

     సంక్రాంతి రేసు లో అన్ని సినిమా ల కన్నా ఆలస్యంగా బరిలోకి దిగిన విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన F2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరి ఊహకలకు అందని విధంగా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలన కలెక్షన్స్ తో సంక్రాంతి విన్నర్ గా నిలవగా ఇప్పుడు సంక్రాంతి సీజన్స్ లో ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ గ్రాసర్ గా…

నిలిచి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.

ఇటు విక్టరీ వెంకటేష్ కెరీర్ లో కానీ అటు వరుణ్ తేజ్ కెరీర్ లో కానీ ఇది మొట్ట మొదటి 100 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమా అని చెప్పాలి. అలాగే సంక్రాంతి రేసు లో 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న మూడో సినిమా గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా… ఇది వరకు…

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా ఈ మార్క్ ని అందుకుని ఫైనల్ గా 164 కోట్ల గ్రాస్ ని అందుకోగా నిర్మాతల లెక్కల ప్రకారం నట సింహం బాలయ్య నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి 100 కోట్ల కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకుంది.

ఇక ఇప్పుడు మూడో ప్లేస్ లో ఎంటర్ అయిన F2 సినిమా 13 వ రోజు కలెక్షన్స్ తో ఆల్ టైం టాప్ 2 సంక్రాంతి గ్రాసర్ గా కన్ఫాం అవ్వగా లాంగ్ రన్ లో మరింత జోరు తో సినిమా రీసెంట్ బిగ్ హిట్స్ లో కొట్టి, స్టార్ హీరోల సినిమాలు కొన్ని బ్రేక్ చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!