బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సినిమాల్లో ఆల్ టైం ఎపిక్ రికార్డులతో ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా…. మొదటి రోజు ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన ఈ సినిమా….
హిస్టరీలో నిలిచి పోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది… ఇక రెండో రోజు మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ ఉన్నా కూడా కేరళలో అలాగే ఓవర్సీస్ లో రిమార్కబుల్ హోల్డ్ ని చూపించిన సినిమా ఓవరాల్ గా రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి…
ఆల్ మోస్ట్ 100 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం. మొదటి రోజు ఆల్ మోస్ట్ 67 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసిన సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…
వరల్డ్ వైడ్ గా అవలీలగా 31-33 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్నట్లు అంచనా…దాంతో రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఏకంగా 100 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకుని…
సంచలనం సృష్టించగా…మలయాళ సినిమాల పరంగా ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ తో పాటు ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ఓవర్సీస్ మార్కెట్ లో సినిమా అంచనాలను మించి కుమ్మేయడం విశేషం. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.