బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెలలో రిలీజ్ కాబోతున్న మూవీస్ లో పెద్ద సినిమానే అయినా కూడా ఆ సినిమాకి ఆడియన్స్ లో క్రేజ్ రావడానికి ఎంతో కొంత కారణం అయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) స్పెషల్ రోల్ చేస్తూ ఉండటం మాత్రమే మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) సినిమా…
అంచనాలు పెంచగా వరల్డ్ వైడ్ గా జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎప్పటి నుండో వార్తల్లో ఉన్నప్పటికీ రీసెంట్ గా మళ్ళీ సినిమా హార్డ్ డ్రైవ్ దొంగతనం అవ్వడంతో మళ్ళీ వార్తల్లో నిలవగా, ఓవరాల్ గా మంచు విష్ణు కెరీర్ లోనే…
ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓవరాల్ గా రన్ టైం పరంగా మంచు విష్ణు కెరీర్ లో అతి పెద్ద రన్ టైంతో రూపొందిన సినిమాగా తెరకెక్కింది అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా ఫైనల్ రన్ టైం సుమారుగా…
3 గంటల 12 నిమిషాల రన్ టైంతో ఆడియన్స్ ముందుకు రాబోతుందని అంటున్నారు. సినిమా మీద అసలే అంతగా బజ్ లేని సినిమా ఒక్క ప్రభాస్ పేరు మీద బజ్ ఏర్పడగా మరీ ఇంత రన్ టైం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉండగా…
సినిమా మీద తిరిగి ట్రేడ్ లో ఆడియన్స్ లో క్రేజ్ పెరగాలి అంటే ఒక సాలిడ్ ట్రైలర్ కట్ చాలా అవసరం అని చెప్పాలి. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ట్రైలర్ సినిమా మీద ఎంతవరకు అంచనాలను పెంచుతుంది అలాగే ఈ రన్ టైంతో సినిమా ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి ఇక…