Home న్యూస్ 100 కోట్ల సినిమా అన్నారు….ఈ మిస్టేక్స్ ఏంటి…ఈ ట్రోల్స్ ఏంటి సామి!!

100 కోట్ల సినిమా అన్నారు….ఈ మిస్టేక్స్ ఏంటి…ఈ ట్రోల్స్ ఏంటి సామి!!

0

చాలా టైంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో మంచు విష్ణు(Manchu Vishnu) ఒకరు…కెరీర్ లో ఢీ, దేనికైనా రెడీ, దూసుకేల్తా లాంటి కొన్ని సినిమాలు హిట్ అయినా వరుస పెట్టి ఎప్పటి కప్పుడు ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకుంటూ కెరీర్ లో చాలా స్లో అయిన మంచు విష్ణు ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా…

తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో ఇప్పుడు కన్నప్ప(Kannappa Movie) లాంటి 100 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ మూవీతో వస్తున్న మంచు విష్ణు రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ ను రిలీజ్ చేసిన తర్వాత క్వాలిటీ అండ్ ప్రభాస్ అండ్ అక్షయ్ కుమార్ షాట్స్ సినిమా మీద ఎక్స్ పెర్టేషన్స్ ని పెంచేసినా కూడా…

టీసర్ లో కొన్ని షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ కి కారణం అవుతున్నాయి అని చెప్పాలి ఇప్పుడు…టీసర్ లో ఒక చోట విల్లుతో టార్గెట్ ను గురి చూస్తూ గాల్లో ఈగిరే హీరో తన టార్గెట్ ను చూడకుండా కెమరాని చూస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తూ ఉండటంతో ఆ సీన్ ను స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉండగా…

మరో సీన్ లో గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉండగా ఒకే వ్యక్తి రెండు మూడు చోట్ల కనిపిస్తూ ఉండటం కూడా ట్రోల్స్ కి కారణం అవుతుంది. ఇక టీసర్ ఎండ్ లో విష్ణు శివయ్యా అంటూ చెప్పిన డైలాగ్ కూడా అంత ఇంపాక్ట్ ఫుల్ గా లేక పోవడంతో ఆ సీన్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ భారీగా పడుతున్నాయి… 

ఈ సినిమా ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా మంచు విష్ణు ప్రీవియస్ మూవీస్ ట్రోల్స్ ఇంపాక్ట్ వలన ఈ సినిమా విషయంలో కూడా ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మేకర్స్ ఈ మిస్టేక్స్ ని ఎంత త్వరగా సరిదిద్దుకుంటే సినిమా విషయంలో ట్రోల్స్ తగ్గి బజ్ అంత పెరిగే అవకాశం ఉంటుంది. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here