Home గాసిప్స్ 100 కోట్ల నష్టం అంట….అయినా తప్పట్లేదు అంటున్నారు!

100 కోట్ల నష్టం అంట….అయినా తప్పట్లేదు అంటున్నారు!

0

కరోనా వలన థియేటర్స్ అన్నీ కూడా 7 నెలలుగా మూసేసే ఉండగా, థియేటర్స్ ని మళ్ళీ తెరచుకోవచ్చు అంటూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసినా కానీ కొత్త సినిమాలు ఏవి కూడా రిలీజ్ కి సిద్ధం అవ్వడం లేదు, బాలీవుడ్ మూవీస్ కూడా వెనుకంజ వేస్తూ ఉండగా రీసెంట్ గా మహారాష్ట్ర లో థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు అంటూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో బాలీవుడ్ మూవీస్ రిలీజ్ అవుతాయేమో అని అంతా ఎదురు చూస్తున్నా…

ప్రస్తుతానికి ఇంకా ఏవి కన్ఫాం కాలేదు, ఇక బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ లక్ష్మీ బాంబ్ పేరు మార్చుకుని లక్ష్మీ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా బడ్జెట్ మీద సాలిడ్ బిజినెస్ ని సొంతం చేసుకుని అల్టిమేట్ ప్రాఫిట్ లోనే ఉన్నా కానీ…

నిర్మాతలు సినిమా వల్ల 100 కోట్ల మేర నష్టం అని అంటున్నారట, దానికి కారణం సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్న యూనిట్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయ్యి ఉంటే మినిమమ్ 200 కోట్ల నుండి 250 కోట్లు అయినా కలెక్ట్ చేసే సత్తా ఈ సినిమా కి ఉందని,

కానీ పరిస్థితుల వలన సినిమాను డైరెక్ట్ రిలీజ్ కోసం 125 కోట్లతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి అమ్మాం అని, థియేటర్స్ తెరచినా ఇప్పుడు పరిస్థితుల దృశ్యా డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నామని అంటున్నారట. అందుకే సినిమా సత్తాని బట్టి చూస్తె బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా ను ఇప్పుడు మినిమమ్ 100 కోట్ల రేంజ్ లాస్ తోనే…

రిలీజ్ చేస్తున్నామని అంటున్నారట వాళ్ళు… సినిమాపై విమర్శలు కూడా ఉన్నప్పటికీ క్రేజ్ మాత్రం బాగానే ఉంది ఈ సినిమా, కరోనా లాంటివి లేకుండా ఉంటే కచ్చితంగా అంచనాలను మించి సినిమా పెర్ఫార్మ్ చేసి ఉండేదేమో కానీ ఇప్పుడు కరోనా వలన డైరెక్ట్ రిలీజ్ అవుతున్న సినిమా అక్షయ్ కుమార్ కెరీర్ బెస్ట్ మూవీ అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here