Home గాసిప్స్ 100 కోట్ల సినిమా…డైరెక్టర్ కోసం చూస్తున్న నాగార్జున!

100 కోట్ల సినిమా…డైరెక్టర్ కోసం చూస్తున్న నాగార్జున!

966
0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున తన దైన రేంజ్ విజయాన్ని అందుకుని 4 ఏళ్ళు అవుతుంది. 2016 లో బాక్స్ ఆఫీస్ దగ్గర సోగ్గాడే చిన్ని నాయన మరియు ఊపిరి సినిమాలతో సూపర్ సక్సెస్ లను దక్కించుకున్న నాగార్జున తర్వాత మాత్రం హిట్స్ దూరం అయ్యాడు… ఇక రీసెంట్ టైం లో ఆఫీసర్ సినిమా నెగటివ్ షేర్ ని అందుకోగా మన్మథుడు 2 బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీ గా నిలిచి షాక్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు నాగార్జున అప్ కమింగ్ మూవీస్ లైనప్ మాత్రం మెల్లి మెల్లిగా స్ట్రాంగ్ గా మారుతుంది అని చెప్పాలి. ముందుగా వైల్డ్ డాగ్ తో వస్తున్న నాగార్జున తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక సినిమా సోగ్గాడే సినిమా సీక్వెల్ చేయబోతుండగా వీటితో పాటు…

రెండేళ్ళ క్రితమే కమిట్ అయిన ఓ బ్లాక్ బస్టర్ రీమేక్ కి కూడా ఓకే చెప్పాడు. బాలీవుడ్ లో రెండేళ్ళ క్రితం అజయ్ దేవగన్, ఇలియానా ల కాంబినేషన్ లో వచ్చిన రైడ్ సినిమా 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపగా సినిమా ను అప్పుడే తెలుగు లో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు నాగార్జున.

కానీ అప్పటి కమిట్ మెంట్స్ వల్ల ఆగిపోగా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని తిరిగి మొదలు పెట్టాలని చూస్తున్నాడు… దానికోసం తెలుగు లో డైరెక్టర్ ని వెతికే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. కొత్త డైరెక్టర్ తో చేయోచ్చు కానీ ఎవరైనా మంచి డైరెక్టర్ తో చేస్తే సినిమా తెలుగు లో కూడా మంచి విజయాన్ని అందుకునే అవకాశం…

ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ దొరికిన వెంటనే బాక్ టు బాక్ సినిమాలను ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నాడు నాగార్జున. సోగ్గాడే సీక్వెల్ వర్క్ కంప్లీట్ అవ్వక పొతే ప్రవీణ్ సత్తారు సినిమా తర్వాత ఈ సినిమానే చేయాలని కూడా అనుకుంటున్నాడట. మరి ఎం జరుగుతుందో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here