ఎప్పటి నుండో రీమేక్ అవ్వాల్సిన ఒక సినిమా ఎప్పటి కప్పుడు కాంబినేషన్ సెట్ అవ్వక పోస్ట్ పోన్ అవుతూనే ఉంది… బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమాను తెలుగు లో హిందీ లో ఎప్పటి నుండో రీమేక్ చేయాలనీ ట్రై చేస్తూనే ఉన్నారు కానీ కాంబినేషన్ సెట్ అవ్వక పోవడం తో ఎప్పటి కప్పుడు డిలే అవుతున్న ఈ సినిమా విషయం లో ఇప్పుడు సరికొత్త కాంబినేషన్…
కన్ఫాం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ నాగార్జునలు కలిసి ఈ సినిమాను మల్టీ స్టారర్ గా చేసే ఆలోచనలో ఉన్నారని లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఆ సినిమానే తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన…
విక్రం వేదా సినిమా… విజయ్ సేతుపతి మరియు మాధవన్ ల కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా ఇండియా లో 70 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 100 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాంటి ఈ సినిమాను అప్పటి నుండే రీమేక్ చేయాలనీ…
చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎప్పుడూ సెట్ కాలేదు. కానీ ఇప్పుడు సడెన్ గా రేసులోకి మెగాస్టార్ అండ్ కింగ్ లు ఎంటర్ అయ్యారు, టాలీవుడ్ లో సన్నిహితంగా ఉండే సీనియర్ హీరోలు అయిన వీళ్ళు కలిసి ఓ సినిమా చేయాలనీ ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్నారు కానీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. కానీ ఇప్పుడు సడెన్ గా ఈ ప్రాజెక్ట్ తెరపైకి రాగా…
అన్నీ అనుకున్నట్లు జరిగితే విక్రం వేద తెలుగు రీమేక్ లో ఈ ఇద్దరూ కనిపించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇద్దరు హీరోలకు అద్బుతమైన ఎలివేషన్ లు ఉండే ఈ సినిమా తెలుగు లో రావాలని ఎప్పటి నుండో ఆడియన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ సారి ఈ న్యూస్ అయినా నిజం అయ్యి సినిమా తెలుగు లో వస్తే కచ్చితంగా రచ్చ రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు.