బాలీవుడ్ స్టార్స్ లో అల్టిమేట్ మాస్ క్రేజ్ ఉన్న హీరోలలో బాలీవుడ్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఒకరు కాగా రీసెంట్ టైంలో మంచి హిట్ లేక పోయినా కూడా సల్మాన్ సినిమా అంటే ఆడియన్స్ లో క్రేజ్ మాత్రం బాగానే ఉంటుంది. లేటెస్ట్ గా సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ సికందర్(Sikandar Movie)…
సినిమా రంజాన్ కానుకగా రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే సినిమా కి ఆడియన్స్ నుండి భారీగా నెగటివ్ టాక్ సొంతం అవ్వగా రివ్యూలు కూడా బిలో యావరేజ్ టు డిసాస్టర్ రేంజ్ లో సొంతం అయ్యాయి. కానీ పండగ టైం లో ఈ ఒక్క సినిమానే రిలీజ్ అవ్వడంతో…
కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో లేక పోయినా కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయిన సినిమా ఇప్పుడు డిసాస్టర్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి.
మొత్తం మీద 5 రోజుల టైంకి ఆల్ మోస్ట్ 100 కోట్ల మార్క్ ని దాటేసిన సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్ లో మరో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. కానీ టాక్ మాత్రం నెగటివ్ గానే ఉండటంతో ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మొత్తం మీద బాక్స్ అఫీస్ దగ్గర సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అన్నా కూడా 240 కోట్ల కి తగ్గని నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి లాంగ్ రన్ లో సికందర్ మూవీ ఈ టాక్ తో ఎంతవరకు వాల్యూ టార్గెట్ ను అందుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి ఇప్పుడు.