బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) రీసెంట్ టైంలో హిందీలో అనుకున్న రేంజ్ లో హిట్స్ లేక పోవడంతో సరైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉండగా…ఈ ఇయర్ ఏ ఆర్ మురగదాస్ డైరెక్షన్ లో చేసిన సికందర్(Sikandar Movie) మూవీ మీద రిలీజ్ కి ముందు పర్వాలేదు అనిపించే రేంజ్ లో…
అంచనాలు ఏర్పడినా కూడా రిలీజ్ తర్వాత రంజాన్ కి మినిమమ్ అంచనాలను కూడా అందుకోలేక పోయిన సినిమా మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో వరుసగా 100 కోట్ల సినిమాలతో మాస్ రచ్చ కొనసాగిస్తున్న సల్మాన్ ఖాన్ కి…
ఈ సినిమా కొంచం ఎదురుదెబ్బగా నిలుస్తుంది అని అందరూ అనుకున్నా ఎలాగోలా లాంగ్ రన్ లో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అయితే సినిమా దాటింది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా ఫ్లాఫ్ రిజల్ట్ నే సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకోగా…
రీసెంట్ గా సినిమా డిజిటల్ లో రిలీజ్ అయింది. నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగా అక్కడ మంచి వ్యూవర్ షిప్ ను అయితే సొంతం చేసుకుంటూ ఉండగా మరో పక్క సినిమాకి అక్కడ కూడా ఓ రేంజ్ లో మిక్సుడ్ టాకే సొంతం అయ్యింది అని చెప్పాలి ఇప్పుడు.
సినిమాలో సల్మాన్ ఖాన్ చాలా నీరసంగా కనిపించగా ఎలివేషన్ సీన్స్ లాంటివి కూడా పెద్దగా ఇంపాక్ట్ ని చూపించ లేక పోయాయి. అసలు మురగదాస్ హీరో అంటే ఓ రేంజ్ లో ఎలివేషన్స్ లాంటివి అందరూ ఎక్స్ పెర్ట్ చేస్తారు కానీ సికందర్ మూవీ చాలా నిరాశ పరిచిందని చెప్పాలి.
అందుకే ఎక్స్ ట్రీమ్ మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుని ఆపసోపాలు పడి సినిమా 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా ఇక్కడ సినిమా వ్యూవర్ షిప్ బాగున్నా కూడా సినిమా కంటెంట్ సోషల్ మీడియాలో సైతం ట్రోల్స్ కి కారణం అవుతుంది. ఓవరాల్ గా సల్మాన్ ఖాన్ కెరీర్ లో మరిచిపోయే సినిమాల్లో ఒకటిగా సికందర్ సినిమా నిలుస్తుందని చెప్పొచ్చు.