టాప్ స్టార్స్ నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆ సినిమాలకు యూట్యూబ్ లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుంది అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక పాన్ ఇండియా సినిమాలు వస్తే ఆ సినిమాల క్రేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రికార్డులు మరో లెవల్ లో ఉంటాయి అని అందరూ అనుకోవడం ఖాయం…
లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అవ్వగా ట్రైలర్ రికార్డులతో దుమ్ము లేపుతుంది అని అందరూ అనుకున్నారు…
కానీ అటు వ్యూస్ పరంగా ఇటు లైక్స్ పరంగా చూసుకున్నా కూడా ట్రైలర్ అనుకున్న రేంజ్ లో జోరు చూపించడం లేదు ఇప్పుడు…లైక్స్ పరంగా ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ నుండి ఫాస్టెస్ట్ 6 లక్షల లైక్స్ వరకు చూసుకుంటే దేవర ట్రైలర్ కి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వలేదు…
ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని 9 నిమిషాల టైం తీసుకుని ఆల్ టైం టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకోగా, 2 లక్ష లైక్స్ పరంగా 27 నిమిషాల టైం తీసుకుని టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకుంది… ఇక 3 లక్షల లైక్స్ పరంగా గంటా 3 నిమిషాల టైం తీసుకుని టాప్ 7 ప్లేస్ ను అందుకుంది.
ఇక ఫాస్టెస్ట్ 4 లక్షల లైక్స్ పరంగా 2 గంటల 7 నిమిషాల టైం తీసుకుని టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక 5 లక్షల లైక్స్ పరంగా 4 గంటల 5 నిమిషాల టైం తీసుకోగా ఇక్కడ కూడా టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక 6 లక్షల లైక్స్ పరంగా ఆల్ మోస్ట్…
14 గంటల 10 నిమిషాల టైం తీసుకుని మరోసారి టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకుంది…ఓవరాల్ గా రికార్డులతో మాస్ జాతర సృష్టిస్తుంది అనుకున్నా కూడా దేవర ట్రైలర్ కి రికార్డుల పరంగా టాప్ 5 లో కూడా ఎంటర్ కాలేక పోయింది….
ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయినా కూడా రికార్డుల పరంగా మాత్రం ఎక్స్ పెర్టేషన్స్ ను ట్రైలర్ అందుకోలేక పోయింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సినిమా మాత్రం రికార్డుల విషయంలో మాస్ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు.