Home న్యూస్ 100K టు 800K…..ఇవేం రికార్డులు సామి దుమ్ము లేచిపోయింది!

100K టు 800K…..ఇవేం రికార్డులు సామి దుమ్ము లేచిపోయింది!

0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సినిమా ఆడియన్స్ ముందుకు 25న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు మేకర్స్. కాగా ట్రైలర్ ను ముందు ఒక టైం అనుకున్నా కానీ…

ఆ టైం కి రిలీజ్ చేయలేక పోయిన మేకర్స్ చివరి నిమిషంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లంస్ రావడంతో ట్రైలర్ రిలీజ్ ను ఆలస్యం చేశారు. లేట్ చేసినా కానీ ఫ్యాన్స్ రంగంలో దిగి యూట్యూబ్ రికార్డుల విషయంలో దుమ్ము లేపే రేంజ్ లో కొత్త రికార్డులను నమోదు చేస్తూ….

ఒక లక్ష నుండి…8 లక్షల లైక్స్ దాకా ప్రీవియస్ రికార్డుల బెండు తీసిన ఈ ట్రైలర్ ఒక లక్ష లైక్స్ ని 3 నిమిషాలకు పైగా టైం తీసుకోగా 2 లక్షల లైక్స్ కి 7 నిమిషాలకు పైగా టైం తీసుకుంది, ఇక 3 లక్షల లైక్స్ కి 13 నిమిషాలకు పైగా టైం తీసుకోగా…. 4 లక్షల లైక్స్ కి….

21 నిమిషాలకు పైగా టైం తీసుకుంది. ఇక 5 లక్షల లైక్స్ విషయానికి వస్తే 33 నిమిషాలకు పైగా టైం తీసుకోగా 6 లక్షల లైక్స్ విషయానికి వస్తే 49 నిమిషాలకు పైగా టైం తీసుకుంది. ఇక 7 లక్షల లైక్స్ మార్క్ ని అందుకోవడానికి 1 గంటా 13 నిమిషాలకు పైగా టైం తీసుకోగా 8 లక్షల లైక్స్ ని అందుకోవాడానికి 1 గంటా 56 నిమిషాల టైం తీసుకుంది ఈ సినిమా… ఇలా ఒక లక్ష నుండి 8 లక్షల దాకా….

లైక్స్ విషయంలో ప్రీవియస్ రికార్డుల కన్నా కూడా భారీ మార్జిన్ తో కొత్త రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది భీమ్లా నాయక్ ట్రైలర్. ఇక 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి యూట్యూబ్ లో ఓవరాల్ గా ఇంకా ఎంత దూరం వెళుతుంది అన్నది ఆసక్తి గా మారగా ఫైనల్ లెక్క ఏ రేంజ్ లో ఉంటుంది అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here