చాలా టైంగా షూటింగ్ జరుపుకుంటూ డిలే అవుతూ వచ్చిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు జూన్ 12న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్…
పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ ను అయితే సొంతం చేసుకున్నాయి కానీ గ్రౌండ్ లెవల్ లో ఆశించిన బజ్ ఇంకా జనరేట్ అవ్వాల్సి ఉంది. ఇక సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ చేయగా…ఆల్ మోస్ట్ 4 రోజుల టైం తీసుకున్న తర్వాత…
సినిమా నార్త్ అమెరికాలో 100K డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి ఇప్పుడిప్పుడే జోరు చూపించడం మొదలు పెట్టింది. ఇతర పాన్ ఇండియా మూవీస్ 2 వారాల ముందు ఉన్న స్టేటస్ తో కంపేర్ చేస్తే హరి హర వీర మల్లు సినిమా చాలా దూరంలోనే ఉంది కానీ ఒక్కసారి…
ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి బజ్ ను కనుక క్రియేట్ చేయగలిగితే బుకింగ్స్ లో గ్రోత్ కనిపించే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఎక్కువ జోరు చూపిస్తాయి అనుకున్నా కూడా…
సినిమా మీద ప్రస్తుతం ఉన్న క్రేజ్ కి అద్దం పట్టేలానే బుకింగ్స్ ఉన్నాయ్ అని చెప్పాలి. ఇక సినిమా ట్రైలర్ ను జూన్ మొదటి వారం స్టార్టింగ్ లోనే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ట్రైలర్ రిలీజ్ తర్వాత పరిస్థితులు అన్నీ నార్మల్ అయ్యి సినిమా ట్రెండ్ మాసివ్ గ్రోత్ ని చూపిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.