గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత…
అంచనాలు మరింతగా పెరిగిపోయాయి అని చెప్పాలి ఇప్పుడు…ఓవరాల్ గా ట్రైలర్ క్వాలిటీ కంటెంట్ అంతా ఎక్స్ లెంట్ గా ఉన్నట్లు అనిపిస్తూ ఉండటంతో సంక్రాంతికి సాలిడ్ గా వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందీ అనిపించేలా సినిమా ట్రైలర్ మెప్పించింది అని చెప్పాలి..
ఇక యూట్యూబ్ లో కూడా సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా ట్రైలర్ వ్యూస్ పరంగా ఆల్ రెడీ ఈ ఆర్టికల్ అప్ డేట్ చేసే టైంకి ఆల్ మోస్ట్ 32 మిలియన్స్ కి పైగా వ్యూస్ మార్క్ ని దాటేసి కుమ్మేసింది. ఇక లైక్స్ పరంగా కూడా మంచి జోరుని చూపిస్తూ…
5 లక్షలకు పైగా లైక్స్ మార్క్ ని అందుకుని రచ్చ చేసింది. ఒక లక్ష నుండి 5 లక్షల లైక్స్ ని అందుకోవడానికి సినిమా ట్రైలర్ కి పట్టిన టైం ని గమనిస్తే ఒక లక్ష లైక్స్ ని అందుకోవడానికి 25 నిమిషాల టైం తీసుకున్న గేమ్ చేంజర్ ట్రైలర్ 2 లక్షల లైక్స్ ని అందుకోవడానికి…
61 నిమిషాల టైం ని తీసుకుంది…ఇక 3 లక్షల లైక్స్ మార్క్ ని అందుకోవడానికి 2 గంటలకు పైగా టైం తీసుకున్న ఈ ట్రైలర్ 4 లక్షల లైక్స్ మార్క్ ని అందుకోవడానికి 3 గంటల 18 నిమిషాల టైం తీసుకుంది…1 లక్ష నుండి 3 లక్షల లైక్స్ లిస్టులో టాప్ 10 లో కూడా ఎంటర్ అవ్వలేక పోయినా కూడా…
ఫాస్టెస్ట్ 4 లక్షల లైక్స్ విషయంలో టాప్ 9 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక 5 లక్షల లైక్స్ మార్క్ ని అందుకోవడానికి 16 గంటల రేంజ్ లో టైం తీసుకోగా టాప్ 10 లో ఎంటర్ అవ్వలేక పోయింది. ఓవరాల్ గా వ్యూస్ పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేంజ్ కి దూసుకు పోతున్న ట్రైలర్ లైక్స్ పరంగా పర్వాలేదు అనిపిస్తూ ఉంది ఇప్పుడు.