Home న్యూస్ 8 గంటల్లో 100M**….అల్లకల్లోలం చేశారుగా!

8 గంటల్లో 100M**….అల్లకల్లోలం చేశారుగా!

0

ఇప్పుడు వరల్డ్ వైడ్ సినీ లవర్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా స్పైడర్ మాన్ నో వే హోమ్, వచ్చే నెల 17 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా అన్ని రికార్డుల బెండు తీసింది. ఇప్పుడు సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ కూడా ఊహకందని రచ్చ చేస్తూ దుమ్ము దుమారం లేపుతుంది.

ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయిన 7 గంటల నుండి 8 గంటల టైం కే యూట్యూబ్ లో 21 మిలియన్ వ్యూస్ ని ట్విట్టర్ లో 16 మిలియన్ వ్యూస్ ని అందుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేయగా ఇతర యూట్యూబ్ ఛానెల్స్ అండ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కలిపి…

ఓవరాల్ గా 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుందని సమాచారం. రికార్డుల విషయంలో అల్లకల్లోలం చేస్తూ దూసుకు పోతున్న స్పైడర్ మాన్ నో వే ట్రైలర్ ఇండియాలో ఇప్పుడు అవెంజర్స్ తర్వాత మోస్ట్ వాంటెడ్ మూవీ అని చెప్పాలి. ఏమాత్రం టాక్ బాగుంటే ఎండ్ గేమ్ కలెక్షన్స్ ని ఇండియాలో ఈ సినిమా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here