అవసరాల శ్రీనివాస్ రుహాని శర్మ ల కాంబినేషన్ లో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నూటొక్క జిల్లాల అందగాడు సినిమా… రీసెంట్ గానే రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడం లో ఏమాత్రం సక్సెస్ కాలేక పోయింది. సినిమా ఓపెన్ అవ్వడం పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ టాక్ తో ఓపెన్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మినిమం ఇంపాక్ట్ ని…
బాక్స్ ఆఫీస్ దగ్గర చూపలేక పోయింది. సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ వరకు తెలుగు రాష్ట్రాల్లో 32 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 34 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా తర్వాత వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది ఈ సినిమా..
కొత్త సినిమాల వలన తర్వాత థియేటర్స్ ని కూడా కోల్పోవాల్సి వచ్చిన ఈ సినిమా మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైం తెలుగు రాష్ట్రాలలో 48 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 52 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం…
సినిమాను మొత్తం మీద 1.8 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మించగా బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ ఏమి చేయలేదు, దాంతో సినిమాను ఓన్ గానే రిలీజ్ చేశారు. ఇక సినిమాను మొత్తం మీద 250 వరకు థియేటర్స్ లో మంచి పబ్లిసిటీ తో రిలీజ్ చేశారు. డీసెంట్ టాక్ రావడం తో కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా కానీ మొత్తం మీద వరల్డ్ వైడ్ గా…
కోటి రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ తో రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా బిజినెస్ ఏమి లేక పోవడం తో పెద్దగా నష్టాలను ఏమి సొంతం చేసుకోలేదు కానీ బిజినెస్ ప్రకారం చూసుకుంటే మట్టుకు బడ్జెట్ లో నాలుగో వంతు కలెక్షన్స్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సరిపెట్టుకోవాల్సి వచ్చింది… ఇక అవసరాల శ్రీనివాస్ అప్ కమింగ్ మూవీస్ మీదే ఆశలు పెట్టుకున్నాడు.