ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి కానీ వాటిలో నోటబుల్ మూవీస్ గా అవసరాల శ్రీనివాస్ నటించిన నూటొక్క జిల్లాల అందగాడు సినిమా ట్రైలర్ తో కొంచం పర్వాలేదు అనిపించినా కానీ ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత మరీ అనుకున్న రేంజ్ లో అయితే రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేక పోయింది. సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే టాక్ ఓవరాల్ గా లభించినా…
కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయింది ఈ సినిమా….. సినిమా రిలీజ్ అవ్వడం ఆల్ మోస్ట్ 250 థియేటర్స్ లో గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అయిన ఈ సినిమా బిజినెస్ వివరాలు ఏమి కూడా బయటికి రాలేదు కానీ సినిమాను మేకర్స్…
తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ ఓన్ గానే రిలీజ్ చేశారని సమాచారం. ఇక సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 16 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా రెండో రోజు 7 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఆదివారం సినిమా 9 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా…
టోటల్ గా వీకెండ్ లో తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 32 లక్షల రేంజ్ లో షేర్ ని 50 లక్షలకు పైగా గ్రాస్ ను సాధించగా వరల్డ్ వైడ్ గా 34 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. సినిమా మొదటి వీకెండ్ లో చాలా ఏరియాల్లో డెఫిసిట్ లు అలాగే నెగటివ్ షేర్స్ కూడా పడ్డాయి. అవి ఏవి కూడా తీయకుండా ఈ కలెక్షన్స్ చెప్పాం..
అవి కూడా తీసేస్తే సినిమా కి మొత్తం మీద చిల్లర కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా జనలాను థియేటర్స్ కి రప్పించడం లో తీవ్రంగా విఫలం అయ్యింది అని చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్ లో ఏమైనా హోల్డ్ ని చూపెట్టి ఎంతో కొంత కలెక్షన్స్ తో రన్ అవుతుందా లేక వారానికే పరుగును ముగుస్తుందా అనేది తెలియాల్సి ఉంది.