బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఏడాది తమిళ్ ఇండస్ట్రీ తరుపున బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన సినిమా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందిన మహారాజ(Maharaja Movie), వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న విజయ్ సేతుపతి కెరీర్ లో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని టోటల్ రన్ లో 104 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…తర్వాత డిజిటల్ లో కూడా కుమ్మేసిన సినిమా ఇప్పుడు పరాయి దేశం అయిన చైనాలో రిలిజ్ అయ్యి అక్కడ కూడా కుమ్మేస్తుంది….
సినిమా అక్కడ ఆల్ మోస్ట్ 40 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వగా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమా అక్కడ హాల్ఫ్ మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్ళని అందుకోగా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మరోసారి కుమ్మేసిన హాల్ఫ్ మిలియన్ డాలర్స్ తో కుమ్మేసింది…
ఓవరాల్ గా సినిమా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో అక్కడ 1.20 మిలియన్ డాలర్స్ రేంజ్ లో వసూళ్ళని అందుకున్న సినిమా ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 10.25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా… డే 2 కలెక్షన్స్ పరంగా ఏకంగా 9.2 కోట్ల వసూళ్ళని సాధించింది.. 2 డేస్ కలెక్షన్స్ 19.50 కోట్ల రేంజ్ లో కుమ్మేశాయి.
సినిమాకి ఆడియన్స్ నుండి మంచి టాక్ అక్కడ నుండి కూడా వస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో అక్కడ మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఓవరాల్ గా లాంగ్ రన్ లో చైనాలో అనుకున్న రేంజ్ లో కుమ్మేస్తే కోలివుడ్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది.