బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ అంచనాల నడుమ రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల గేమ్ చేంజర్(Game Changer) మొదటి రోజు కొంచం టాక్ మిక్సుడ్ గా ఉన్నప్పటికీ కూడా ఓపెనింగ్స్ పరంగా అన్ని చోట్లా సాలిడ్ స్టార్ట్ నే సొంతం చేసుకుంది. అది మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో…
అలాగే రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ రేంజ్ లో లేక పోయినా కూడా ఉన్నంతలో ఎప్పటి నుండో డిలే అవుతూ, లేట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి మిక్సుడ్ టాక్ ను తెచ్చుకున్నా తొలిరోజు మంచి రచ్చ చేసింది అని చెప్పాలి ఇప్పుడు. రిలీజ్ కి ముందు రోజు వరకే ఓవరాల్ గా…
ఇండియా లో 40 కోట్లు ఓవర్సీస్ లో 10 కోట్ల మేర గ్రాస్ బుకింగ్స్ ను అందుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో 62-65 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉండగా హిందీ లో ట్రెండ్ బాగానే జోరు చూపించగా డబుల్ డిజిట్ మార్క్ ని క్రాస్ చేసే అవకాశం ఉందని చెప్పాలి మాస్ సెంటర్స్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క అంచనాలను కూడా మించి పోయే అవకాశం ఎంతైనా ఉంది……ఇక కర్ణాటక తమిళ్ అండ్ కేరళ కలిపి సినిమా ఓవరాల్ 8-10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…
సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఇండియా లో సినిమా ఓవరాల్ గా మొదటి రోజు 80-85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం మించి పోయే ఛాన్స్ ఉండగా ఓవర్సీస్ లో సినిమా 2 మిలియన్ టు 2.5 మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండటంతో….
వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సినిమా 100-105 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. కానీ సినిమా కాంబో మీద ఉన్న హైప్ కి….సినిమా బడ్జెట్ అండ్ బిజినెస్ రేంజ్ కి….
ఇంకా సాలిడ్ ఓపెనింగ్స్ ను అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు….కానీ అలా జరగలేదు….కానీ సంక్రాంతి లాంగ్ వీకెండ్ మొత్తం ఉండటంతో ఇతర సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ గేమ్ చేంజర్ మూవీ మంచి రన్ అందుకునే అవకాశం ఉంది. ఇక మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ అంచనాలను మించిపోతాయా లేక ఇదే రేంజ్ లో ఉంటాయో చూడాలి.