మిగిలిన సంక్రాంతి సినిమాలతో పోల్చితే చిన్న సినిమాగా అనిపించినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 66.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…
వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా 88.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఓ రేంజ్ లో కుమ్మేసింది. ఇక సినిమా 4వ రోజున నార్మల్ వర్కింగ్ డే నే అయినా కూడా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ మాస్ కుమ్ముడు కుమ్ముతుంది….నార్మల్ డే లో ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీలతో దూసుకు పోతున్న సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 14-15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో..
కూడా ఎక్స్ లెంట్ గానే హోల్డ్ ని చూపిస్తూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా సినిమా 4వ రోజున ఇప్పుడు 17 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా…ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా ట్రేడ్ లెక్కల్లో 100 కోట్ల మైలురాయిని దాటేసి సంచలనం సృష్టించింది అని చెప్పాలి..
తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 4 రోజుల కలెక్షన్స్ లెక్క 81 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 105 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.. వెంకటేష్ కెరీర్ లో ఫాస్టెస్ట్ కలెక్షన్స్ రికార్డులతో దూసుకు పోతున్న సినిమా ఇక 4 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.