పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రీసెంట్ మూవీ కల్కి(Kalki 2898 AD TRP Rating) సినిమా లాస్ట్ ఇయర్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే…కంప్లీట్ గా డ్రై గా మారిపోయిన బాక్స్ ఆఫీస్ దగ్గర జూన్ లాంటి నెలలో రిలీజ్ అయ్యి అల్టిమేట్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని…
బాక్స్ ఆఫీస్ ను అన్ని చోట్ల ఊహకందని రేంజ్ లో షేక్ చేసి సంచలనం సృష్టించిన కల్కి మూవీ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…అన్ని చోట్లా ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో రెండో 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.
టోటల్ రన్ లో అంచనాలను అన్నీ మించి పోతూ ఏకంగా 1061 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని కుమ్మేసిన ఈ సినిమా బిజినెస్ మీద 167 కోట్లకు పైగా ప్రాఫిట్ ను కూడా సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. తర్వాత డిజిటల్ లో కూడా సాలిడ్ గా వ్యూవర్ షిప్ ను…
సొంతం చేసుకుని కుమ్మేసిన ఈ సినిమాను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు….జీ తెలుగు లో సినిమా ను బాగా ప్రమోట్ చేసి టెలికాస్ట్ చేశారు…ఆడియన్స్ ఆల్ రెడీ సినిమాను థియేటర్స్ లో ఓటిటి లో కూడా చూసేసి ఉన్నప్పటికీ టెలివిజన్ లో మరోసారి ఈజీగా చూసే రేంజ్…
కంటెంట్ ఉన్న కల్కి మూవీ కి మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో కాకపోయినా కూడా డీసెంట్ టి.ఆర్.పి రేటింగ్ వస్తుందని అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు కానీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ బాక్స్ అఫీస్ రిజల్ట్ తో పోల్చితే సినిమా టి.ఆర్.పి రేటింగ్ చాలా తక్కువగా వచ్చింది…
ఓవరాల్ గా అర్బన్ లో 5.26 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అర్బన్+రూరల్ లో కలిపి యావరేజ్ గా 4.56 టి.ఆర్.పి రేటింగ్ నే సొంతం చేసుకుంది…చాలా వరకు ఫ్లాఫ్ మూవీస్ కూడా దీని కన్నా బెటర్ రేటింగ్స్ ను సొంతం చేసుకుంటున్నాయి రీసెంట్ టైం లో…
మిగిలిన ఛానెల్స్ తో పోల్చితే జీ తెలుగు లో సినిమాలకు రేటింగ్స్ కొంచం తక్కువే వస్తాయి కానీ 1061 కోట్ల హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అయిన కల్కి లాంటి సినిమాకి ఇంత తక్కువ టి.ఆర్.పి ని మాత్రం ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో టెలివిజన్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.