సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు మెయిన్ లీడ్ లో మంచు విష్ణు నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ ఇండియా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి కూడా సోషల్ మీడియాలో సినిమా హాష్ టాగ్ పై చాలా కామెంట్స్ అండ్ మీమ్స్ నిండిపోయాయి. కొన్ని రీసెంట్ గా మోహన్ బాబు చెప్పినట్లు హాస్యాన్ని కలిగించేలా ఉన్నా కొన్ని….
హద్దులు దాటినట్లు కూడా ఉన్నాయి….. సినిమా రిలీజ్ టైం లో బాక్స్ ఆఫీస్ స్టేటస్ పై అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు ఫ్యామిలీ మాటలపై సోషల్ మీడియాలో భారీగా కామెంట్స్ పడ్డాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత అవి ఇంకా పెరిగి పోయాయి. దాంతో మంచు ఫ్యామిలీ వాళ్ళు….
ట్రోల్ చేసిన వాళ్ళు ఆ ట్రోల్స్ ని తీయకుంటే కోర్టులో కేసు వేసి ఏకంగా 10 కోట్ల నష్టపరిహారం కట్టేలా చేస్తామంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు…. దాంతో సోషల్ మీడియా మొత్తం ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది… సినిమా బాగుంటే బాగుంది అని అంటారు లేదా బాలేదని అంటారు కానీ కొందరు బాక్స్ ఆఫీస్ ప్రదర్శనకి మించి కొందరు వ్యక్తిగత ట్రోల్స్ కి దిగడం వలన ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు అని సమాచారం.