బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ట్రైలర్ తో మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన సినిమా హిడింబ(Hidimbha), కానీ సినిమా పరంగా అంతంత మాత్రమే ఉండటం వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా జోరు చూపించలేక పోయింది. అయినా కానీ ఉన్నంతలో…
2.30 కోట్ల రేంజ్ దాకా షేర్ ని సినిమా థియేట్రికల్ రన్ లో సొంతం చేసుకుంది. ఇక సినిమా కి మేకర్స్ అన్ని ఖర్చులతో కలిపి 10 కోట్ల రేంజ్ బడ్జెట్ లో సినిమాను నిర్మించగా సినిమా థియేట్రికల్ రిలీజ్ ఓన్ గానే పెర్సెంటేజ్ పద్దతిలో రిలీజ్ చేశారు…
కాగా సినిమా రీసెంట్ గా ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రేటు 8 కోట్ల దాకా సొంతం అయ్యిందని అప్ డేట్ చేయగా ఇప్పుడు సినిమా మొత్తం మీద థియేట్రికల్ కలెక్షన్స్ తో కలిపి ఆల్ మోస్ట్ 10.30 కోట్ల దాకా రికవరీని సొంతం చేసుకుందని చెప్పొచ్చు.
ఇక సినిమాకి మ్యూజిక్ అండ్ ఇతర రైట్స్ కూడా కొద్ది వరకు ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా మేకర్స్ కి సినిమా ద్వారా మరీ నష్టాలు ఏమి రాలేదు కానీ టేబుల్ ప్రాఫిట్ కొద్ది వరకు సొంతం అయ్యింది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం వర్కౌట్ అయినా కూడా.అ..
మేకర్స్ కి మంచి లాభాలు సొంతం అయ్యి ఉండేవని చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా హిందీ డబ్బింగ్ రేటు అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారని, వేరే వాళ్ళని కూడా ట్రై చేస్తున్నారని అంటున్నారు. మంచి రేటుని సొంతం చేసుకుంటే మేకర్స్ కి ఓవరాల్ గా లాభాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.