బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit)-మంచు మనోజ్(Manchu Manoj) నటించిన భైరవం(Bhairavam Movie) మూవీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా మొదటి వీకెండ్ లో పర్వాలేదు అనిపించినా తర్వాత మాత్రం వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయిన సినిమా రెండో వీకెండ్ లో పెద్దగా…
పోటి ఏమి లేక పోవడంతో పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపించింది కానీ అది సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి అయితే ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి. సినిమా 9వ రోజున కొద్ది వరకు గ్రోత్ ని అయితే చూపించగా 10వ రోజున సండే అడ్వాంటేజ్…
ఉన్నప్పటికీ మరీ అనుకున్న రేంజ్ లో ట్రెండ్ ను అయితే చూపించలేదు…ఓవరాల్ గా 36 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 38 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకోగా 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది…
దాంతో సినిమా టోటల్ గా 10 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Bhairavam Movie 10 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 2.89Cr~
👉Ceeded: 97L~
👉Andhra: 3.18Cr~
AP-TG Total:- 7.04CR(12.45CR~ Gross)
👉KA+ROI+OS : 0.86CR****approx
Total WW Collections: 7.90CR(Gross – 14.35CR~)
(47%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు 50% రికవరీని కూడా అందుకోలేక పోయింది. క్లీన్ హిట్ కోసం ఇంకా 9.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.