బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో రిమార్కబుల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఓ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) 9 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 183 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా….
వరల్డ్ వైడ్ గా సినిమా 362.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా 10వ రోజు అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపిస్తూ దూసుకు పోతున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో హిందీ లో, కర్ణాటకలో దుమ్ము దుమారం లేపే రేంజ్ లో మాస్ రచ్చ చేసింది 10వ రోజున ఇప్పుడు…
ఇక సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ఇప్పుడు 8.5-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ అంచనాలను కూడా మించవచ్చు. ఇక సినిమా హిందీలో ఈ రోజు 4.5-5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.
ఇక సినిమా కర్ణాటకలో ఈ రోజు 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళ్ అండ్ కేరళలో పెద్దగా హోల్డ్ లేదు కానీ ఓవర్సీస్ లో మాత్రం మరోసారి మంచి జోరుని చూపిస్తూ ఉండటంతో….ఓవరాల్ గా ఇప్పుడు 10వ రోజున వరల్డ్ వైడ్ గా…
17-17.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ అంచనాలు మించి 18 కోట్ల మార్క్ ని కూడా అందుకునే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ తో ఓవరాల్ గా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 192 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…
సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 380 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ అంచనాలను కూడా సినిమా మించే ఛాన్స్ ఉంది. ఇక టోటల్ గా సినిమా 10 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.