కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన 20 ఏళ్ల క్రితం మూవీ అయిన సచిన్(Sachien Movie) రీసెంట్ గా రీ రిలీజ్ అవ్వగా ఊహకందని రేంజ్ లో ఊచకోత కోస్తూ అద్బుతమైన హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా రీ రిలీజ్ మూవీస్ లో సౌత్ తరుపున ఆల్ రెడీ…
రెండో 10 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటిన సినిమాగా నిలిచి సంచలనం సృష్టించగా, అక్కడితో ఆగకుండా రెండో వీక్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోయిన సినిమా తమిళనాడులో అద్బుతమైన హోల్డ్ ని చూపించింది…
ఓవరాల్ గా 10 రోజులు పూర్తి అయ్యే టైంకి ఈ సినిమా బుక్ మై షోలో ఏకంగా 2 లక్షల 50 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. రెండో వీక్ లో కూడా 9-10 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…
ఓవరాల్ గా 10 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఏకంగా 13 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించడం విశేషం, తమిళ్ లో ఒక పక్క గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి కొత్త సినిమా ఉన్నప్పటికీ ఈ సినిమాను బాగానే ఎగబడి చూశారు జనాలు.
ఒకసారి సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sachien Re Release 10 Days Total WW Collections Approx
👉Tamilnadu – 10.05Cr
👉Karnataka – 0.90Cr
👉ROI – 0.35Cr
👉Overseas – 1.85Cr***approx
Total WW collection – 13.15CR Gross Approx
ఓవరాల్ గా సౌత్ లో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో కేవలం 2 సినిమాలు మాత్రమే 13 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటాయి…ఆ రెండు సినిమాలు కూడా ఒక్క విజయ్ పేరిటే ఉండటం తన స్టార్ డం కి నిదర్శనం అని చెప్పాలి. ఇక ఇప్పటికీ రన్ అవుతున్న ఈ సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.