లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) మూవీ అందరూ కొత్త వాళ్ళతోనే తెరకెక్కగా కలెక్షన్స్ పరంగా మంచి జోరునే చూపించి 10 రోజుల్లో డీసెంట్ లాభాలను కూడా సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది.
సినిమా తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ లో మంచి ట్రెండ్ ను చూపించింది. నార్త్ అమెరికాలో ఆల్ మోస్ట్ 250K డాలర్స్ మార్క్ ని అందుకుని సూపర్ స్ట్రాంగ్ గా రెండో వీకెండ్ లో కూడా వసూళ్ళని అందుకోగా 10వ రోజున సండే అడ్వాంటేజ్ తో సినిమా ఆల్ మోస్ట్…
5.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మంచి జోరుని చూపించగా ఆల్ మోస్ట్ 30 లక్షలకు పైగా గ్రాస్ ను 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 19 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది.
టోటల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 6.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా 10 రోజుల కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది….
Subham Movie 10 Days Total WW Collections Report(est)
👉Nizam: 96L~
👉Total AP: 1.15Cr~
AP-TG Total:- 2.11CR(4.30CR~ Gross)
👉KA+ROI+OS : 1.14CR****approx
Total WW Collections: 3.25CR(Gross – 6.75CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.8 కోట్ల రేంజ్ లో వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 45 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మంచి విజయాన్ని అందుకోగా మిగిలిన రన్ లో ఇంకా లాభాలను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.