Home న్యూస్ 9లో 2 మాత్రమే….ఇప్పుడు లెక్క 8….మామూలు దెబ్బ కాదిది!

9లో 2 మాత్రమే….ఇప్పుడు లెక్క 8….మామూలు దెబ్బ కాదిది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన అన్ని సినిమాలు హిట్ అవ్వాలని రూల్ ఏమి లేదు కానీ ఎంతో కొంత ఒకటి హిట్ ఒకటి ఫ్లాఫ్ అన్నా ఆ యాక్టర్ కెరీర్ బాగా సాగుతుంది. కానీ టాప్ స్టార్స్ కి ఎన్ని ఫ్లాఫ్స్ పడినా క్రేజ్ తగ్గదు అంటారు కానీ లేటెస్ట్ గా బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) కి మాత్రం…

రీసెంట్ టైంలో అసలు ఏ సినిమా చూసినా కూడా రిజల్ట్ ఏమాత్రం కలిసి రావడం లేదు…కోవిడ్ కి ముందు కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నప్పటికీ కోవిడ్ తర్వాత థియేటర్స్ లో అక్షయ్ కుమార్ నటించిన సినిమాల రిజల్ట్ తీవ్రంగా నిరాశ పరిచే విధంగా ఉన్నాయి… మొత్తం మీద కోవిడ్ తర్వాత అక్షయ్ కుమార్ నటించిన…

 బెల్ బాటం, సూర్యవంశీ, బచ్చన్ పాండే, సామ్రాట్ పృద్విరాజ్, రక్షా భందన్, రామ్ సేతు, సేల్ఫీ, OMG2  మరియు మిషన్ రాణిగంజ్ సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో సూర్యవంశీ మరియు OMG2 లు మాత్రమే హిట్ అయ్యాయి. అందులో కూడా సూర్యవంశీలో ఇతర స్టార్స్ స్పెషల్ రోల్స్ అలాగే రోహిత్ శెట్టి డైరెక్టర్ అవ్వడం కలిసి వస్తే…

OMG2 లో అక్షయ్ ది స్పెషల్ రోల్…. కానీ ఓవరాల్ గా 9 సినిమాల్లో 2 సినిమాలు హిట్ అవ్వగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు అక్షయ్ కుమార్ నటించిన బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan) రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది… బడ్జెట్ దృశ్యా బాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్…

ఫ్లాఫ్స్ లో ఈ సినిమా ఒకటి అంటూ చెబుతున్నారు… దాంతో ఓవరాల్ గా థియేటర్స్ లో రీసెంట్ టైంలో అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు 10 రిలీజ్ అయితే అందులో 8 సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకున్నాయి. ఇలాంటి టైంలో ఓ భారీ కంబ్యాక్ ఇప్పుడు అక్షయ్ కుమార్ కి చాలా చాలా అవసరం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here