బాక్స్ ఆఫీస్ దగ్గర థార్డ్ వేవ్ ఇంపాక్ట్ అలాగే సినిమా టాక్ గట్టి ఇంపాక్ట్ నే నాగార్జున నాగ చైతన్య ల లేటెస్ట్ మూవీ బంగార్రాజు పై క్రియేట్ అయ్యేలా చేస్తుంది అని చెప్పాలి. ఈ సినిమా సంక్రాంతి వీకెండ్ లో ఎలాగోలా కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకున్నా కానీ తర్వాత మాత్రం పరిస్థితి మొత్తం మారిపోయి కలెక్షన్స్ ఏమాత్రం అనుకున్న రేంజ్ లో రావడం లేదు, ఎలాగోలా మొదటి వారాన్ని…
పూర్తీ చేసిన బంగార్రాజు సినిమా రెండో వీకెండ్ లో అడుగు పెట్టగా సినిమా కి శుక్ర మరియు శని వారాల్లో మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ గ్రోత్ కనిపించగా 10 వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఆల్ మోస్ట్ 15-20% డ్రాప్స్ ను మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో…
సొంతం చేసుకున్న సినిమా ఈవినింగ్ షోలలో బుకింగ్స్ బాగానే ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై ఎక్కువ డిపెండ్ అయింది సినిమా… దాంతో సినిమా ఇప్పుడు 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 60-65 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునేలా ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఇంకా పెరగొచ్చు కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఈ కలెక్షన్స్ అస్సలు సరిపోవు అనే చెప్పాలి. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.