బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో సెకెండ్ వీకెండ్ ని ఊరమాస్ గా కొనసాగిస్తూ దుమ్ము లేపుతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు అంచనాలను మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…
ఇప్పుడు 10వ రోజు సండే అవ్వడంతో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు కొనసాగుతుంది. సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాలలో తొలి 2 షోలకు కూడా ఆల్ మోస్ట్ 9వ రోజు లెవల్ లోనే దుమ్ము లేపేలా హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుంది. కొన్ని చోట్ల డ్రాప్స్ ఉన్నా కానీ…
ఓవరాల్ గా ఫెంటాస్టిక్ డే 10 లోడ్ అవుతుంది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా సాలిడ్ గానే ఉండటం తో ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా మరో సారి ఆల్ మోస్ట్ 9 వ రోజు లెవల్ కి అటూ ఇటూ గా…..
కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు… సేఫ్ సైడ్ లో చెప్పాలి అంటే 15-16 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఇక హిందీ లో ఈ రోజు 25 కోట్లకి తగ్గని నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక కర్ణాటక, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా దూసుకు పోతున్న ఈ సినిమా..
ఇండియాలో ఈ రోజు 35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా 38 కోట్ల రేంజ్ లో వసూళ్లు రాబట్టవచ్చు. ఇవి ప్రజెంట్ అంచనాలు మాత్రమే ఇక నైట్ షోల టైం కి సినిమా గ్రోత్ ఇంకా ఉంటే ఈ రోజు లెక్క కూడా అంచనాలను మించి పోయే భీభత్సం ఎంతైనా ఉందని చెప్పాలి. డే ఎండ్ అయ్యే టైం కి సినిమా స్టేటస్ ను మరోసారి అప్ డేట్ చేస్తాం…