బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ సినిమా ఇప్పుడు లాస్ట్ బెస్ట్ డే ని ఈ రోజు సొంతం చేసుకుంది అనుకోవచ్చు… ఇది కూడా అద్బుతం కాదు కానీ మరి కొన్ని రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా రాబోతుంది కాబట్టి ఇక అప్పటి వరకు మిగిలినవి వర్కింగ్ డేస్ అవ్వడం తో ఉన్నంతలో ఈ రోజు రాధే శ్యామ్ కి చివరి పెద్ద రోజు గా చెప్పొచ్చు…
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 9వ రోజు తో పోల్చితే 10-15% వరకు గ్రోత్ ని ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో చూపించింది కానీ ఆఫ్ లైన్ లో పెద్దగా గ్రోత్ అనుకున్న విధంగా ఉంటే ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాలలో 10 వ రోజు మొత్తం మీద 40 లక్షల నుండి 45 లక్షల దాకా…
షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా గ్రోత్ ఉంటే మొత్తం మీద 50 లక్షల రేంజ్ కి వెళ్ళొచ్చు కానీ దానికి తక్కువ అవకాశం ఉందని చెప్పాలి. ఇక హిందీ లో సినిమా ఈ రోజు కోటి రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది… మరి అఫీషియల్ కలెక్షన్స్ ఈ రేంజ్ లోనే ఉంటాయో లేదో చూడాలి ఇక…