మెగాస్టార్ మెగా హిస్టారికల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజులు పూర్తీ అయ్యే సరికి 125 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. సినిమా 9 వ రోజే 3.5 కోట్ల రేంజ్ షేర్ అనుకుంటే 3 కోట్ల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజు లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా కొంచం షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.
మళ్ళీ కొత్త వీకెండ్ మొదలు అయినా కానీ గ్రోత్ కనిపించ లేదు సరి కదా సినిమా 9 వ రోజు తో పోల్చితే 10 వ రోజు డ్రాప్స్ గట్టిగానే ఉన్నాయి. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సినిమా ఆల్ మోస్ట్ 30% కి పైగానే డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల కి….
వచ్చే సరికి 5% వరకు గ్రోత్ ని ఎలాగోలా సాధించినా కానీ మొత్తం మీద రోజు ముగిసే సరికి 9 వ రోజు తో పోల్చితే 25% వరకు డ్రాప్స్ ని ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సాధించింది. సినిమా మొత్తం మీద ఈ లెక్కన 10 వ రోజున 2.2 కోట్ల నుండి 2.3 కోట్ల వరకు షేర్ ని అందుకోవచ్చు.
ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి సినిమా 2.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. కానీ మిగిలిన చోట్ల మాత్రం సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయింది. ఈ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 2.6 కోట్ల నుండి 2.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
దాంతో సినిమా ఇతర భాషల్లో ఇక గ్రోత్ కష్టమే అని తేటతెల్లం అయింది. దాంతో 10వ రోజు 2.3 కోట్ల రేంజ్ షేర్ గొప్ప విషయమే అయినా కానీ అందుకోవాల్సిన టార్గెట్ పెద్దదిగా ఉందటమ్ తో సినిమా కి మరింత భారీ గా కలెక్షన్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇక 10 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.