బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఊరమాస్ హోల్డ్ ని చూపెడుతూ మొదటి వారంలోనే డబుల్ బ్లాక్ బస్టర్ నుండి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా…ఈ వీకెండ్ లో పెద్దగా పోటి ఏమి లేకపోవడంతో…
ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ ఈ సినిమానే అవ్వగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ కుమ్ముడు కుమ్మేస్తూ దూసుకు పోతుంది. 9వ రోజున అనుకున్న అంచనాలను మించి జోరు చూపించిన ఈ సినిమా 10వ రోజున సండే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా…
సాలిడ్ గా జోరు చూపెడుతూ హోల్డ్ ని కొనసాగిస్తుంది…ఈ రోజు IPL మ్యాచుల ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా 9వ రోజుకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతున్న కోర్ట్ మూవీ ఆల్ మోస్ట్ 9వ రోజుకి సిమిలర్ గానే ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా…నైట్ షోలకు…
కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రలలో 1.3-1.4 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా మరోసారి మంచి జోరుని చూపెడుతున్న సినిమా ఓవరాల్ గా 1.6-1.7 కోట్ల రేంజ్ కి తగ్గని లెవల్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. చిన్న సినిమా ఈ రేంజ్ లో ఊచకోత కోయడం మామూలు విషయం కాదు. ఇక టోటల్ గా 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.