బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో అడుగు పెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపుతూ ఇప్పుడు రెండో శనివారం అద్బుతంగా దుమ్ము లేపిన తర్వాత ఇప్పుడు 10వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఊహకందని రేంజ్ లో ఇప్పుడు….
సినిమా 9వ రోజుతో కంపేర్ చేస్తే 10వ రోజు మాస్ గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతుంది. నైజాంలో నైట్ షోల ట్రెండ్ కూడా బాగానే ఉండగా ఆంధ్ర సీడెడ్ లలో ఊహకందని రేంజ్ లో జోరు చూపెడుతూ ఉంది, సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో…
ఓవరాల్ గా 10వ రోజు ఇప్పుడు 4.5 కోట్ల మార్క్ ని దాటేసి 4.5-5 కోట్ల రేంజ్ నుండి ఆ పైన వెళ్ళే ఛాన్స్ ఉంది, ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించితే 5-5.50 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం కూడా ఉంది. ఇక హిందీలో ఈ రోజు 3.5-4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక కర్ణాటకలో ఈ రోజు ఎక్స్ లెంట్ గా జోరు పెంచిన సినిమా మాస్ రచ్చ చేస్తూ ఉండగా తమిళ్ అండ్ కేరళ డౌన్ అయినా ఓవర్సీస్ లో మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తుంది. దాంతో ఇప్పుడు 10వ రోజు వరల్డ్ వైడ్ గా అంచనాలను మించిపోయే రేంజ్ లో…
8.5-9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు ఓవరాల్ గా అంచనాలను మించిపొతే ఈ షేర్ మార్క్ ని కూడా మించే అవకాశం కనిపిస్తుంది. సినిమా ఓవరాల్ గా 10 వ రోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా…
లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా అన్ని చోట్లా ఓ రేంజ్ లో కుమ్మేయగా సాలిడ్ లాభాల దిశగా దూసుకు పోతుంది. ఇక టోటల్ గా సినిమా 10 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.