బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో సినిమా డ్రాప్స్ ను భారీగా సొంతం చేసుకోగా ఇప్పుడు వీకెండ్ లో ఎంటర్ అయిన సినిమా శుక్రవారమ కొద్ది వరకు గ్రోత్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించినా కానీ థియేటర్స్ తగ్గడం వలన కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్…
కొద్ది వరకు ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 9వ రోజు లెవల్ లోనే హోల్డ్ చేసింది, కొన్ని చోట్లా ఆక్యుపెన్సీ తగ్గగా కొన్ని చోట్ల బెటర్ గా ఉంది, ఓవరాల్ గా సినిమా ఈ రోజు…
తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 50 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చు, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 60 లక్షల నుండి….
65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. కొంచం గ్రోత్ ఉన్నా కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకొంచం జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇక సినిమా టోటల్ గా 10 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.