బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో జోరు చూపెడుతున్న మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) మూవీ అందుకోవాల్సిన టార్గెట్ సాలిడ్ గా ఉండటంతో ఆ మార్క్ ని అందుకోవడం కష్టమే అయినా ఉన్నంతలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపిస్తూ…
ఇప్పుడు 10వ రోజున సండే అడ్వాంటేజ్ తో మరోసారి పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతున్నా కూడా సినిమా ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకునే దిశగా అయితే పరుగును కొనసాగించలేక పోతుంది ఇప్పుడు…..
ఓవరాల్ గా 9వ రోజుతో పోల్చితే సినిమా 10వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపించగా…కొన్ని చోట్ల డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 30 లక్షల రేంజ్ నుండి ఇక్కడ 35 లక్షల రేంజ్ లో షేర్ ని…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 42-45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క…
మరికొంత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా 85-90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులకి గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.