సూపర్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న కార్తికేయ2 ఆల్ రెడీ అల్టిమేట్ లాభాలను సొంతం చేసుకుని ఊహకందని విజయాన్ని నమోదు చేసింది. ఇక సినిమా ఇప్పుడు రెండో వారం వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా హాలిడే నుండి వర్కింగ్ డే కి వచ్చే సరికి ఎలాంటి డ్రాప్స్ ఉంటాయో అలాంటి డ్రాప్స్ నే సినిమా ఇప్పుడు 10వ రోజున సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది.
9వ రోజు తో పోల్చితే సినిమా 10వ వర్కింగ్ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 65% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ కనిపిస్తున్న ఈ సినిమా హిందీ లో బెటర్ గా హోల్డ్ చేస్తూ…
దూసుకు పోతూ ఉండగా ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది ఈ రోజు. దాంతో ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో అటూ ఇటూగా 80 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఈ రోజు 1.8 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి పొతే సినిమా కోటి రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు… మరి సినిమా మొత్తం మీద ఇప్పుడు 10వ రోజు వర్కింగ్ డే అయినా కానీ…
ఓవరాల్ గా అన్ని చోట్లా డీసెంట్ హోల్డ్ తోనే పరుగును కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఆల్ రెడీ లాభాలు ఓ రేంజ్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ వర్కింగ్ డేస్ లో మినిమమ్ కలెక్షన్స్ ని అందుకున్నా ఓవరాల్ ప్రాఫిట్ మరింత భారీగా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.