బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో మాస్ జాతర సృష్టిస్తూ అన్ని చోట్లా ఓ రేంజ్ లో ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie). రెండో శనివారంలో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా మాస్ హోల్డ్ తో దూసుకు పోతుంది..
9వ రోజు మీద సాలిడ్ గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 7-7.5కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.
ఇక సినిమా కర్ణాటక, తమిళ్ లో ఊరమాస్ జోరు చూపిస్తూ ఉండగా కేరళలో మాత్రం కొంచం స్లో అవ్వగా మూడు చోట్ల కలిపి ఈ రోజు 5-5.5కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, అన్ని చోట్లను మించి హిందీలో సినిమా ఈ రోజు ఊచకోత కోస్తూ….
40-42కోట్ల రేంజ్ లో ఊరమాస్ నెట్ కలెక్షన్స్ దిశగా దూసుకు పోతుంది, ఫైనల్ లెక్కలు బాగుంటే అక్కడ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా ఈ రోజు మంచి జోరుని చూపిస్తూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు…
10వ రోజున 34-36కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. 10వ రోజు సినిమా ఊరమాస్ జోరు చూపిస్తూ ఉండటంతో ఫైనల్ లెక్కలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 10 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.