టాలీవుడ్ సినిమాలు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో మేజర్ గా కలెక్షన్స్ ని సాధిస్తూ ఉంటాయి, కానీ తెలుగు సినిమాలకు ఇక్కడతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉండగా అక్కడ కొందరు స్టార్స్ నటించిన సినిమాలకు టాక్ కి అతీతంగా మంచి కలెక్షన్స్ సొంతం అవుతూ ఉండగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల పరంగా…
నాచురల్ స్టార్ నాని(Nani) ఎపిక్ ఫామ్ తో ఇతర హీరోలను ఫుల్ గా డామినేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. నాని నటించిన సినిమాలు అక్కడ మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైం హైయెస్ట్ 1 మిలియన్ మార్క్ ని అందుకున్న మూవీస్ తో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేశాడు నాని…
నాని నటించిన ఈగ, భలే భలే మోగాడివోయ్, నేను లోకల్, నిన్ను కోరి, MCA, జెర్సీ, అంటే సుందరానికీ, దసరా,హాయ్ నాన్న సినిమాలు అమెరికాలో 1 మిలియన్ మార్క్ ని అందుకోగా టోటల్ గా 9 సినిమాలతో రచ్చ చేసిన నాని ఇప్పుడు తో మరో 1 మిలియన్ మార్క్ ని తన ఖాతాలో వేసుకున్నాడు….
2 బాక్ టు బాక్ హిట్స్ తర్వాత నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తో రన్ అవుతూ ఉండగా ఓవర్సీస్ లో అయితే అంచనాలను మించే రేంజ్ లో బాక్స్ అఫీస్ ను షేక్ చేస్తూ కేవలం 2 రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది….
దాంతో టోటల్ గా 10 సార్లు అమెరికాలో 1 మిలియన్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయడం విశేషం, ఈ రికార్డ్ ను ఇతర టైర్2 హీరోలు అందుకోవాలి అంటే చాలా కష్టమే అని చెప్పాలి. ఈ టైంలో నాని ఫ్యూచర్ మూవీస్ తో తన రేంజ్ ను లెక్కని ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.