బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ తో రెచ్చిపోయిన బాలీవుడ్ ఏస్ ఖాన్ అమీర్ ఖాన్(Amir Khan) తర్వాత టైంలో ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్(Sitaare Zameen Par Movie)తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చాడు అని చెప్పాలి. మొదటి రోజున సినిమా అల్టిమేట్ పాజిటివ్ టాక్ ను…
సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోలేక పోయింది. ఓవరాల్ గా మొదటి రోజున 10.7 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకుంది… కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర యునానిమస్ పాజిటివ్ టాక్ సినిమాకి రెండో రోజున…
ఓ రేంజ్ లో హెల్ప్ అయింది. దాంతో మొదటి రోజుకి ఆల్ మోస్ట్ డబుల్ అనిపించే రేంజ్ లో జోరు చూపించిన సినిమా ఏకంగా 19.90 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో…
సినిమా అన్ని చోట్లా ఊహకందని రేంజ్ లో జోరు చూపించింది. మొదటి రోజు మీద ఆల్ మోస్ట్ ట్రిపుల్ మార్జిన్ గ్రోత్ ని చూపించిన సినిమా ఓవరాల్ గా సండే రోజున 29-30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుందని అంచనా…అంటే మొదటి రోజు మీద ఆల్ మోస్ట్…
20 కోట్ల రేంజ్ లో గ్రోత్ ని చూపించింది అని చెప్పాలి. ఇక మొత్తం మీద వీకెండ్ లో సినిమా ఓవరాల్ గా 60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేసి అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించిపోయింది…
ఇది మాములు విషయం కాదనే చెప్పాలి…ఒకప్పటి అమీర్ ఖాన్ ఫామ్ ఇదే రేంజ్ లో ఉండేది. మళ్ళీ ఆ ఫామ్ ను గుర్తు చేస్తూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న అమీర్ ఖాన్ ఇక వర్కింగ్ డేస్ లో ఎంతవరకు హోల్డ్ ని చూపిస్తాడో చూడాలి ఇప్పుడు.